Harry Brook: ఇంగ్లాండ్ కు కొత్త కెప్టెన్ గా హ్యారీ బ్రూక్.. 7 d ago

పరిమిత ఓవర్ల క్రికెట్ కు ఇంగ్లాండ్ కొత్త కెప్టెన్ ను నియమించింది. జోస్ బట్లర్ కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. ఈ నేపథ్యంలో పరిమిత ఓవర్ల కెప్టెన్ గా హ్యారీ బ్రూక్ ను నియమించారు. యువ ఆటగాడు హ్యారీ బ్రూక్ కు వన్డేలు, టీ20ల్లో సారథ్య బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ప్రకటన చేసింది. ఇంగ్లాండ్ కు నాయకత్వం వహించడం తనకు గొప్ప గౌరవమని బ్రూక్ పేర్కొన్నాడు.